తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులకు,పెద్దలకు, అధ్యక్షులకు,కార్యవర్గ సభ్యులకు, తోటి జీవిత కాల సభ్యులకు, రాష్ట్ర మహిళా సోదరీమణులకు, గ్రేటర్ హైదరాబాద్, 33 జిల్లాల PST లకు, గ్రేటర్ వరంగల్ మరియు అన్ని పట్టనాల, మండలాల నాయకులకు,కుటుంబ సభ్యులకు మరియు . ఫోటోగ్రఫీ వృత్తిని ప్రేమించే ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియజేస్తూ..
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులకు సేవ చేయుటకు గాను,ఆదివారం 15-09-2024 రోజున రాష్ట్ర అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేయడానికి నేను అధ్యక్షునిగా, సిరి రవి ప్రధాన కార్యదర్శి గా, మాధవ రెడ్డి గారు కోశాధికారిగా నామినేషన్ వేయుచున్నామని తెలుపుతూ మీ అందరినీ పేరు పేరునా ఆహ్వానిస్తున్నాను,,,,, SK*హుస్సేన్ , అధ్యక్ష*అభ్యర్థి గత మూడు సవత్సరాలుగా మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి పేరు పేరునా ధన్యవాదాలు...
నేను ఏనాడూ ఒక నాయకునిగా కాకుండా మీ అందరికీ సేవకునిగానే,మీలో ఒక డిగానే ఏటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సన్మానాలకు సత్కారాల కు సాధ్యమైనంత వరకు దూరముగా ఉంటూ అత్యంత సాదాసీదా గా పని చేసాను,,,..... నేను ఎందుకు చెపుతున్నానంటే నాయకుడు అనే వాడు నలుగురిని వెనకేసుకొని తిరుగుతాడు, సేవకుడు ఎప్పుడూ నలుగురితో కలిసి పని చేస్తాడు, మనం చెప్పే మాటల్లో కాదు, చేసే పనిలో నమ్మకం ,నిజాయితి,నిబద్దత ఉండాలని కోరుకునేవాడిని నేను, నేను అలా ఉండడం వలనే ఈ రోజు కొందరు నన్ను తప్పించాలని చూస్తున్నారు,, నేను ఏనాడు పదవుల కోసమో, ఫ్లెక్సీ లో ఫోటో కోసమో పబ్లిసిటీ కోసమో పని చేయలేదు, కేవలం మీ అందరీ మనస్సులో కొంచెం స్తానం కోసమే పరి తపించినవాడిని, నేను మొదటి సారి అధ్యక్షునిగా చేసే క్రమములో ఏనాడు పదవి కోసం ఎవరిని ప్రాధేయ పడలేదు, నేను పోటీ చేస్తాను అని అన్నానే గానీ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడగలేదు, ఇవన్నీ ఎందుకు చేపుతున్నానంటే ఈ రోజు నా మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం మీ అందరికీ తెలియాలని,,... మీ అందరికీ తెలుసు ఈ మూడు సంవత్సరాలు నేను పని చేసిన తీరు, ఈ రోజు కొందరూ మాట్లాడుతున్నారు హుస్సేన్ సర్ పదవి కోసమే ఆరాటపడుతున్నారు అనీ, నాకు పదవే ముఖ్యం అనుకుంటే, కొందరిలా నేనూ లాలూచీ పడిఉంటే, ఈ రోజు ఈ ఎన్నికలు జరిగివే కావూ, మళ్ళీ మీరే ఉండాలనీ బంగారు పళ్లెం లో పెట్టి ఇచ్చేవారు,
ఓక సందర్భములో నాతో ప్రయాణిస్తూ , సర్ మీకు చుక్కలు చూపిద్దాం అనుకున్నా కానీ మీరు తెచ్చిన పథకం వల్ల పేద కుటుంబానికి లక్షల్లో సహాయం అందిస్తే ఆనందంగా ఉంది ,మీరే మళ్ళీ మళ్ళీ అధ్యక్షునిగా ఉండాలని కోరుకున్న వారే ఈ రోజు నన్ను తప్పించాలని చూస్తున్నారు, నిజంగా మీ అందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను , నేను మీకు మంచి చేయలేదు అనుకుంటే, నా పనీ తీరు మీకు నచ్చలేదనుకుంటే మీరు ఏ తీర్పు ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తా,,,,,
ఎందుకంటే తెలంగాణ రాష్ట్రo దేశంలోనే నంబర్ వన్ గా ఉందంటే అది మీ అందరి సహకారం, శ్రమ, కృషి వల్లనే, కేవలం ఆలోచన మాత్రమే నాది, ఆచరణ మొత్తం మీ అందరిదీ, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సాధించిన ప్రగతిలో మీరందరూ భాగస్వాములే,,,, కొందరూ మాత్రం కుటుంబ భరోసా ను చిన్న చూపు చూస్తూ, నన్ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు,కుటుంబ భరోసా వల్ల ఎంత మంది కుటుంబాల్లో వెలుగులు నింపామో ఒక్కసారి ఆ కుటుంబాలను అడిగితే చెబుతారు,,, నిన్న కుటుంబ భరోసా,,, రేపు ఇంకో కొత్త ఆలోచనతో మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను,కుటుంబ భరోసా సహాయాన్ని పెద్ద మొత్తంలో ఇవ్వాలని అహర్నిశలు కృషి చేస్తున్నాను,మీరందరు మరోకసారి అవకాశం ఇస్తే రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్ర అసోసియేషన్ ద్వార మీ అందరి సంక్షేమానికి, సాంకేతిక అభివృద్ధికి,వ్యాపార. అభివృద్ధికి నా శక్తి మేరకు మీ అందరి సహకారంతో పని చేస్తానని హమీ ఇస్తున్నాను.
*ఇక* మిగితా ఇద్దరు మచ్చలేని మంచి మనషులు, సిరి రవి గారు ప్రథాన కార్యదర్శిగా, భీమిడి మాధవ రెడ్డి*గారు కోశాధికారిగా మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నారు, వారు కూడా ఫోటోగ్రఫీ వృత్తిని దైవంగా భావిస్తూ,అసోసియేషన్ ను, కన్న తల్లి గా కొలుస్తూ సేవలందిస్తున్నారు,,,,
మేము ఆదివారం రోజున నామినేషన్ వేస్తున్నామని తెలియజేస్తూ మీరందరు మమ్మల్ని ఆశీర్వదించాలని పేరు పేరునా కొరుకుంటూ,,,,, మీ SK హుస్సేన్,,,, అధ్యక్ష అభ్యర్థి, సిరి రవి, ప్రథాన కార్యదర్శి అభ్యర్థి,,,, భీమిడి,మాధవ రెడ్డి, కోశాధికారి అభ్యర్థి,,,,, అని సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.
Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network
Add my business arrow_forwardCopyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India