Articles

లీనమయ్యే ఫొటొగ్రఫిదే భవిష్యత్తు.. TSR

22, Dec 2023 1972 Views
లీనమయ్యే ఫొటొగ్రఫిదే భవిష్యత్తు.. TSR

ఫొటోగ్రఫిరంగంలో కొత్తకొత్త మార్పులు రాబోతున్నాయి. ఆధునిక టెక్నాలజీ ద్వారా ఛాయాచిత్రాన్ని రికార్డు చేసే పద్దతిలోను దాన్ని ఇతరులతో పంచుకునే పద్దతి టెక్నాలజీతో పోటీపడే పరిస్థితి రాబోతోంది. డిజిటల్‌యుగం రాకపూర్వం 20 సం॥కు ముందు ఫొటోగ్రాఫర్‌ ఒక వివాహ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు తగిన ప్రణాళికతో, కస్టమర్‌కి అనుగుణంగా వేడుకలు ప్రారంభం నుండి మధురస్మృతులను భద్రపరిచి ఫొటో ఆల్బమ్‌ మరియు వీడియో క్యాసెట్లు, డివిడిల రూపంలో అందజేసేవరకు ప్రత్యక్షంగా అంటిపెట్టుకునేవారు. ఫిలింలు కలర్‌ల్యాబ్‌లో డెవలప్‌ చేసిన దగ్గరనుండి ప్రత్యక్షంగా తానే సెలక్టు చేసి వివిధ సైజుల్లో, వివిధరకాల పేపర్లపై ప్రింట్స్‌ వేయించుకుని ఆల్బమ్‌లలో కూడా సర్దుకుని ఓ అపురూప మెమోరీస్‌ పుస్తకాన్ని కస్టమర్‌కి స్వయంగా అందించి ప్రతిఫలం పొంది తాను చేసిన పనికి ఆదాయం ఎంతో సంతృప్తినిచ్చిందనే భావనతో సంతృప్తిపడేవారు. ఒక్కసారి డిజిటల్‌యుగం ప్రారంభం కావటంతో ఎన్నో దశాబ్దాలుపాటు సాంప్రదాయంగా పైవిధంగా కొనసాగే ప్రక్రియలో పెనుమార్పులు రావటంతో నాటి ఛాయాచిత్రకారులు కొంత ఒత్తిడికి లోనయినప్పటికి టెక్నాలజీని తాము నేర్చుకోవాలని వారి వంతు కృషిచేసి నేటికి కొనసాగుతున్నారు.

తొలుత ఒక మెగా పిక్సెల్‌ కెమెరాతో ప్రారంభమైన డిజిటల్‌యుగంలో ఫిలింలు వాడే పద్దతికి స్వస్తి చెప్పి ఫ్లాపీలలో రికార్డు చేసుకునే తొలి పద్దతి నుండి మెమోరీకార్డులలో డేటాను భద్రపరిచే పద్దతిలోకి మారారు. వీడియో రికార్డింగ్‌లు సైతం టేపులు స్థానంలో మెమోరీకార్డుల వాడకం అందుబాటులోకి రావటం జరిగింది.  ఇదంతా ఓ మార్పు ఈ మార్పులో ఫొటోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న కొద్దిమంది మాత్రమే దాన్ని అవగాహన చేసుకుని మంచివ్యాపారం చేయటంలో అప్పటివరకు ఈరంగం వంశపారంపర్యంగా వస్తున్న పద్దతికి ముగింపు వచ్చిందనే చెప్పుకోవాలి. టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండి మరియు సాంకేతిక విద్య పూర్తిచేసిన ఇంజనీరింగ్‌ విధ్యార్దులు సైతం ఈరంగంలోకి ప్రవేశించబడ్డారు. అయితే నేటికి ఆ ప్రయాణం వస్తూ, పోతోంది కొత్తనీరు రాకతో పాతనీరు వెళ్ళి ఎలా జీవనదిగా పిలుచుకుంటామో అలాగే ఫొటోగ్రఫిరంగం ఎంతోమందికి స్వయం ఉపాధిరంగంగా కొనసాగుతోంది.

360 డిగ్రీల ఫొటోలు రూపకల్పన అంతర్గత నిర్మాణం మరియు మరిన్నింటిని నాటకీయ పద్దతిలో ప్రదర్శించేందుకు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. అది అక్కడ ఉన్న అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. నేటి డిజిటల్‌ కెమెరాలు మరియు స్మార్ట్‌ఫోన్‌లలో 360 డిగ్రీల ఫొటోలు సృష్టించగల సామర్ద్యం ఎక్కువగా ఉంది.

అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలోని ఛాయాచిత్రకారులు గాని భారతీయ ఛాయాచిత్రకారులకు అత్యధిక ఆదాయం లభించేది ఒక్క వెడ్డింగ్‌ ఫొటోగ్రఫియే అని చెప్పటంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ఒక సంవత్సరకాలంలో అత్యధికంగా జరిగే వివాహ తేదీలు 160 మించి ఉండవు. ఈ మధ్య భారతీయ మానవవనరుల సర్వేప్రకారం స్వయం ఉపాధిరంగంలో కొనసాగే ఫొటోగ్రాఫర్‌లు సాలీన 3,80,000 నుండి ఐదులక్షల రూపాయలు ఆదాయం పొందుతుంటే, ప్రొఫషనల్స్‌ మాత్రం సాలీన 12 నుండి 19 లక్షలు ఆదాయం వనరులతో ఈరంగంలో స్థిరపడ్డట్లు సర్వే తెలియజేసింది.

 ఒక్క 4 శాతం హై ప్రొఫెషనల్స్‌ మాత్రం 40 నుండి 65లక్షలు పైగా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు స్టుడియో ఏర్పాటుచేసుకుని కష్టమర్‌కి అందుబాటులో ఉంటూ వారి కుటుంబాల్లో జరిగే వివాహం, ఇతర వేడుకలను కవర్‌ చేస్తూ వంశపారంపర్యంగా ఏళ్ళతరబడి జనరేషన్స్‌కి ఫొటోగ్రఫి చేస్తూ మన పూర్వీకులు జీవనం కొనసాగించారు. కాని నేటి సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు వారి ప్రతిభా పాటవాలను ప్రచారం చేసుకునేందుకు నేటి ఆధునిక ఛాయాచిత్రకారులు పోటీపడి కస్టమర్లకు దగ్గరకావటం జరుగుతోంది. ఒకనాడు ఫిలింలు డెవలప్‌చేసి ఆల్బమ్‌ ఇచ్చేవరకు ఫొటోలు కళ్ళముందు కనబడేవికావు. కాని నేటి ఆధునిక కెమెరాలలో అత్యున్నతమైన టెక్నాలజీ ముడిపడి ఉండటంలో ఫొటో క్లిక్‌ చేయబడ్డ కొద్ది సెకన్లులో మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని కష్టమర్‌ కోరిక మేరకు సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌చేయటం జరుగుతోంది.

ఇన్‌స్టెంట్‌ ఫొటో పంపే పద్దతిని కేవలం ఫొటోజర్నలిస్టుల సమయం వృధాకాకూడదని అర్దరాత్రి జరిగే కార్యక్రమంసైతం          ఉదయం పాఠకుని చేతిలో ఉండే దినపత్రికలో ప్రచురించటానికి కెమెరాలో వచ్చిన నూతన విధానం ఈరోజు ఏ వేడుక జరిగిన క్షణాల్లో సోషల్‌ మీడియాకు చేరుతోంది అంటే విజ్ఞాన శాస్త్రం మానవ మేధస్సుకి పని పెట్టినట్లయిందని చెప్పవచ్చు.

 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ A1 సృష్టించిన ఒక చిత్రం అలాగే నేటి విదానంతో మానవుని నేత్రాలు నేర్చుకున్న జ్ఞానం మరియు తన మేధోశక్తితో తీసిన చిత్రం రెండిరటి మధ్య వ్యత్యాసం గురించి చెప్పుకోవాలి. రెండు కళాత్మకంగా అనిపించినా ఫొటోగ్రఫి దాని హృదయంలోని నిజజీవితంలో వాస్తవంగా ఉన్నదాన్ని సంగ్రహిస్తుంది. అదే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ A1 ఎంత కంటికి ఆకర్షించినా అది భౌతికంగా ఎప్పటికి ఉండదు లేదా ఫొటోగ్రఫిని సూచించే దాన్ని భర్తీచేయదు.

183 సంవత్సరాల చరిత్రగల్గిన ఛాయాచిత్రంలో అనేక విభాగాలున్నప్పటికి అత్యధికంగా ఆదాయ వనరులుగా పిలువబడే వెడ్డింగ్‌, మోడల్‌ ఫొటోగ్రఫి, నేచర్‌ మరియు ట్రావెల్‌ ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి. మన తెలుగు రాష్ట్రాలలో ఈరంగంలో కొనసాగేవారు కేవలం వెడ్డింగ్‌, చిన్నచిన్న వేడుకలకే పరిమితమైనవారు అత్యధికంగా ఉన్నారు. బాహ్యప్రపంచంలో జరిగే మార్పులను పరిశీలించాలి కొత్తకొత్త ఆలోచనలకు పదునుపెట్టాలి, కొత్త ఆదాయమార్గాలపై అన్వేషించాలి. ఒకప్పుడు ఫిలింయుగంలో ఇన్ని అవకాశాలు లభించేవికావు. కాని డిజిటల్‌ యుగం ఆతర్వాత మిర్రర్‌లెస్‌ మార్పులతో ఈరంగంలో స్వయంగా స్థిరపడటానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఒకప్పుడు ప్రత్యక్షంగా ఫొటోగ్రాఫర్‌ చేసుకునేవాడు. కాని నేటి యువతరం వారివారి వివాహ వేడుకలు కలకాలం నూరేళ్ళు ఆధునికంగా కనిపించాలనే కోరికలతో నేడు ఓ వివాహ వేడుకను చిత్రీకరించాలంటే రకరకాల విధానాలు పాటించాలి. జనరల్‌ ఫొటోగ్రఫి, కాండిడ్‌ ఫొటోగ్రఫి, అలాగే వీడియోలుసైతం, డ్రోన్‌ చిత్రీకరణ ఎల్‌ఇడిలలో పెళ్ళితంతు చూపించటం, పెళ్ళికిముందు ప్రీవెడ్డింగ్‌ షూట్‌, అలాగే అంతర్జాలంలో ప్రసారంలాంటి విధానాలతో అనేకమందికి అవకాశాలు లభించాయి.

ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఫొటోగ్రఫి (AR) ఇంటరాక్టివిటి మరియు సమర్దత నెమ్మదిగా కానీ ఖచ్చితంగా, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ పొటోగ్రఫి వర్చువల్‌ డిపెండెన్స్‌కి మార్గం సుగమం చేస్తోంది. సాంకేతికతలు దాని అధిక ఇంటరాక్టివిటి మరియు సామర్ద్యం కారణంగా ఆగ్మెంటెడ్‌ రియాలిటీ ఆవలరాస్తుండటంతో రాబోయేకాలంలో ఈరంగం కొనసాగేవారి రొటీన్‌ విధానం మారబోతోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అనంతరం ఆల్బమ్‌ డిజైన్‌, ప్రింటింగ్‌లో అనేక రకరకాల కొత్త కొత్త ఆకర్షించే మీడియాలు వాడకంతోపాటు వీడియో ఎడిటింగ్‌ మరియు దానికి సంబంధించిన హైలైట్స్‌ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో పంపేందుకు  చిన్నచిన్న వీడియోలు రకరకాల పనులతో నేటి ఛాయా చిత్రకారులు పనిచేస్తున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద నగరాలకే అన్ని అందుబాటులో ఉండేవి, కాని నేడు మారుమూల పల్లెల్లో సైతం ఈరకం పద్దతులు కొనసాగుతున్నాయి. కాని ఇక్కడే ఒక్క విషయం మనం చెప్పుకోవాలి ఇంత కష్టపడి పనిచేస్తున్న చాయాచిత్రకారుడికి అన్ని ఖర్చులు పోను మిగిలేవి చాలాతక్కువ దానికి కారణం ఫొటోగ్రాఫర్‌లు ప్రోగ్రాం పోతుందనే భయాందోళనతో ఎంతకైనా తగ్గించి ఒప్పుకుంటున్నారు. కానీ మారాలి అన్ని ధరలు పెరుగుతుంటే ఫొటోగ్రఫి రంగంలో పోటీపడి కస్టమర్‌కి తగ్గించి చేయటం జరుగుతోందని కొందరివాదన.

ఫొటోగ్రాఫర్‌ వద్ద ఖరీదైన డి.ఎస్‌.ఎల్‌.ఆర్‌ కెమెరా ఉన్నంతమాత్రాన మనల్ని మంచి ఫొటోగ్రాఫర్‌గా మార్చదు. ఆక్షణం, సమయం క్లిక్‌చేసే విదానం మంచి ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు లభిస్తుంది అలాగే దాన్ని ఆస్వాదించేవారు సైతం అభినందిస్తారు. ఇప్పటికైనా తెలుగు చాయాచిత్రకారులలో మార్పురావాలి, మంచి పనిపరిజ్ఞానంతో మారితే సులభంగా అత్యధిక మొత్తాన్ని సంపాదించుకోవచ్చు. మీకొత్త ఆలోచనలు, కొత్తకోణాలు, ప్రత్యేకక్షణాలు మీకు మంచి గౌరవాన్ని అందిస్తాయి. ముఖ్యంగా తెలుగువారి పంచాంగం పద్దతిలో ఒకోసారి కొన్నినెలలు వివాహవేడుకలు జరగవు, కొంతగ్యాప్‌ తర్వాత అన్ని ఒకేసారి జరుగుతాయి. కావున పొటోగ్రాఫర్‌లు ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌లుగా ఈరంగంలో స్ధిరపడేందుకు ప్రతివారు కృషిచేయాలి. ఇతర ఫొటోగ్రఫి రంగాలపై దృష్టిసారించాలి. ఫ్యాషన్‌ రంగంలో పోర్ట్రయిట్‌ అలాగే ట్రావెల్‌ విభాగంలో ఫుడ్‌ ప్రొడక్టు చిత్రీకరించటంతో పాటు మీమీ ప్రాంతంలో టూరిష్టుల ఆకర్షణకు సంబంధించిన విశేషాలతో కూడిన చిన్న డాక్యుమెంటరీలు, ఫొటోలను స్టాక్‌  ఇమేజ్‌లకు పంపగలిగితే ఆదాయమార్గాలపై    మళ్ళుతారు. ఈమధ్య నేను కేరళలో వేడుకలు చిత్రీకరించే నిమిత్తమై వెళ్ళినప్పుడు అనేకమంది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాలనుండి యువతరం రావటం గమనించాను. వారితో మాట్లాడితే వారంతా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసుకునేవారే అయితే భారతదేశంలో ఎక్కడ ఉత్సవం జరిగిన దానిపై ఫొటోలు తీసి వాటిని స్టాక్‌ ఇమేజ్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయటం వాటిని అమ్ముతూ సాలీన నాలుగు నుండి ఆరులక్షలు ఆదాయం సంపాదిస్తున్నట్లు ప్రత్యేక ఫొటోలు లక్షన్నర నుండి 2లక్షలు వరకు అమ్ముతున్నట్లుగా తెలిపారు.

పస్‌ట్రాకింగ్‌ టెక్నాలజి ప్రస్తుతం ఎక్కువగా ఆధునికకెమెరాలలో మరియు మొబైల్‌ ఫోన్లలో కనిపిస్తోంది. ఇది కెమెరాద్వారా మానవ ముఖాన్ని గుర్తించటం మరియు ట్రాక్‌ చేసేందుకు అనుమతిస్తుంది. దీనిద్వారా నాణ్యతను పెంచుకుంటూ ఫొటోలు తీయటం చాలాసులభం మరియు సరళీకృతం చేయబడిరది. కెమెరా ఫోకస్‌, ఎక్స్‌పోజర్‌ మరియు కలర్‌బ్యాలన్స్‌ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.

   ఫొటోగ్రఫి భవిష్యత్తు ఏమిటి అనేదానిపై ఈమధ్య బిబిసి ఓ రిపోర్టు సమర్పించింది. గడచిన ఆరునెలల్లో 1.2 ట్రిలియన్‌ డిజిటల్‌ ఫొటోలు దాదాపు 85శాతం ఫొటోలు ఫోన్‌లలోనే చిత్రీకరించబడ్డాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యుత్తమైన కెమెరాలు కల్గిన సామర్ద్యాలు /ఫీచర్‌లకు సరిపోయేవిధంగా ఫోన్‌ కెమెరాలు రావచ్చు.     ఫ్రొఫెషనల్‌  కెమెరాలు, లెన్స్‌లు, ఫిల్టర్‌లు మరియు పరికరాల కోసం స్థలం ఉంటుంది. కానీ ఇది మరింత అరుదుగా సముచితంగా మారుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చలనచిత్రం మరియు వృత్తిపరమైన చిత్రాల నాణ్యత ఎల్లప్పుడు ఉన్నతంగానే ఉంటుంది. అయితే మొబైల్‌ ప్రత్యామ్నాయం చాలాబాగుంది అందరి చేతుల్లో ఇమిడిపోవటంతో ఎక్కువమంది ప్రజలు ప్రామాణికంగా స్వీకరించేందుకు ఐక్యత చూపుతారు. నేను ఇక్కడ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్న ప్రొఫెషన్‌ ఫొటోగ్రఫికి చాలామంచి భవిష్యత్తు ఉంది. ఫోన్‌ ఆధారిత కెమెరా సిస్టిమ్‌ వల్ల ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫికి ముప్పువాటిల్లుతుందని చాలమంది అనుకుంటారు ఇది బొత్తిగా వ్యతిరేకమైనది.

‘కృత్రిమ మేధస్సు’ అనే పదబంధాన్ని 1956లో రూపొందించారు,కృత్రిమ మేధస్సు (Ai, ఫోటోగ్రఫీకి వర్తింపజేసినప్పుడు, స్థిరమైన అర్ధం లేదు. నిర్దిష్ట ఫోటోగ్రాఫిక్‌ సందర్భంలో ఉంచితే తప్ప Ai ఆమోదయోగ్యమైనదా కాదా  అని చర్చించడం అసాధ్యం. ఇమేజ్‌ జనరేటర్‌ సాఫ్ట్‌వేర్‌ రూపాన్ని గురించి చాలా ఆందోళన ఉంది, దీనిని తరచుగా ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ ఉపయోగించడం అని పిలుస్తారు.

ఉదా : ఎక్కువమంది సెల్‌ఫోన్‌లలో ఒకే చిత్రాన్ని అనేక కోణాల్లో జరిగే వేడుకని చిత్రీకరించవచ్చు. కాని ఓ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ మాత్రం ఆ ప్రత్యేక క్షణాన్ని తన మేధాశక్తితో దృశ్యాన్ని తనరీతిలో కాప్చర్‌చేసి ప్రదర్శించినప్పుడు అత్యధికశాతం అభినందిస్తారు. అయితే సెల్‌ఫోన్‌ చిత్రాన్ని వ్యతిరేకించను. ఒకరి దృష్టికి మరొకరిదృష్టికి తేడా ఉంటుంది. చిత్ర నిర్మాణంలోను వ్యత్యాసం ఉంటుంది. ప్రొఫెషనల్‌ చిత్రం సూక్ష్యంగా ూంటుంది మరియు వీక్షకుడిలో భావాలను రేకిత్తిస్తుంది, మరొకటిమాత్రం బ్యాక్‌కవర్‌పై ఉన్నదానియొక్క పునరుత్పత్తి అవుతుంది, దృశ్యమానంగా చూస్తే సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉంటుంది.

ఫోకస్‌ స్టాకింగ్‌ అనేక వ్యక్తిగత చిత్రాలను తీసుకుంటుంది, నిర్దిష్ట మార్గంలో సేకరించబడుతుంది మరియు ప్రాక్టికల్‌ ఆప్టిక్స్‌ ద్వారా సాధించలేని ఫీల్డ్‌ యొక్క లోతుతో ఒకే తుది చిత్రాన్ని రూపొందించడానికి ప్రతి చిత్రం యొక్క ఇన్‌-ఫోకస్‌ భాగాలను స్టాక్‌ చేస్తుంది. ప్రతి చిత్రం యొక్క భాగాలు వాటి టోనల్‌ విలువల ఆధారంగా ఎంపిక చేయబడటం మినహా నణR సమానంగా ఉంటుంది.పనోరమా స్టిచింగ్‌ ఒకేలా ఉంటుంది కానీ ఇమేజ్‌ అంచుల మ్యాచింగ్‌తో ఉంటుంది.

  సుదీర్ఘమైన చరిత్ర కల్గిన ఫొటోగ్రఫిలో అనేక మార్పులను చూశాం. తడిప్లేట్లనుండి నేటి స్మార్ట్‌ ఫోన్‌లవరకు గతకొన్నేళ్ళుగా కెమెరా సాంకేతికంగా గణనీయమైన మార్పులతో నూతనపోకడలు వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్ళపాటు ఈవృత్తిలో కొనసాగేవారు అనేక ఆర్ధిక ఒత్తిడులను చూసి ఇప్పుడిప్పుడే కొంతమేరకు తిరిగి ఆర్ధికంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌లు మాత్రమే ఈవిధంగా నిలబడ్డారు అని చెప్పటంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ఫొటోగ్రాఫర్‌లు అందరిలో మాత్రం పొటోగ్రఫి భవిష్యత్తు ఏమిటి?  రాబోయేకాలంలో ఇంకా ఎలాంటి మార్పులు ఆశించవచ్చు, మన జీవితాలను ఎలా మారుస్తుంది అనే ఆలోచనల్లో ఉన్నారు.

ఫొటోగ్రఫి అనేది ఆధునికంగా అభివృద్ది చెందిన ఒక కళారూపం. ఇది ముఖ్యమైన సంఘటనలు, వేడుకలు, అందమైన చిత్రాలు రూపొందించేందుకు ఉపయోగించబడుతుంది. ఫొటోగ్రాఫర్‌ వద్ద అత్యంత ఖరీదైన, శక్తివంతమైన సెన్సార్‌ కల్గిఉండవచ్చు. కాని ఇటీవలవరకు రెండు కోణాలవరకే పరిమితం కాబడిరది. మీ ఫొటో ఎల్లప్పుడు 2D గా ఉంటుంది. కాని 3D  ఫొటోగ్రఫి చాలకాలంగా ఉన్నప్పటికి అందరికి అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు మీస్మార్ట్‌ఫోన్‌లో  3D చిత్రాలు సృష్టించవచ్చు. కానీ 3D అనేది ఎల్లప్పుడు ఒక సముచిత ఆనందం, కొద్దిగా జిమ్మిక్కుగా ూంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో కెమెరాలు మరియు కంప్యూటర్లు పూర్తిగా లీనమై 3D చిత్రాలు రూపొందించేదశలో ఉన్నాయి. 3D చిత్రాలు ప్రాజెక్టు చేసినప్పుడు మీరు వాటిని అన్ని కోణాలు నుండి చూడవచ్చు. మీరు వివాహ వేడుకల్లో తలంబ్రాలు పోయటంచూస్తే వీక్షకులపై పడిన అనుభూతిని పొందుతారు. దీనికితోడు 360 కెమెరా టెక్నాలజి మనల్ని పూర్తిగా లీనమై దానివైపు నడిపిస్తోంది. కాని ఇది సైన్స్‌ ఫిక్షన్‌లాగా అనిపించవచ్చు. 360 డిగ్రీల ఫొటోలపై ఫోకస్‌చేస్తే ఎడమవైపు, కుడివైపు అలాగే క్రిందకి మరియు పైకి కావలసిన విధంగా చూడవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో జూమ్‌ చేసుకునే వీలుంది. వీక్షకుడు చిత్రంపై ఏదైనా పాయింట్‌ని క్లిక్‌చేసి దాన్ని కావలసిన దిశలో పొందే అవకాశం ఉంటుంది. విశాలమైన ఫొటోల కలయిక ద్వారా చుట్టూ తిరిగే విధంగా 360 డిగ్రీల పద్దతివల్ల పరిసర వాతావరణాన్ని సమకూర్చే సామర్ధ్యం సాధించటానికి తప్పనిసరిగా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవలసి ఉంటుంది. డిజిటల్‌ కెమెరా తరచుగా షీట్‌లను సమలేఖనం చేయటంలో సహాయపడే అంతర్మిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండి 360 డిగ్రీల ఫొటోగా మార్చేందుకు మరియు స్మార్ట్‌ఫోన్‌లోని మొబైల్‌యాప్‌ ద్వారా రూపొందించేందుకు అప్లికేషన్స్‌ అప్‌లోడ్‌ చేయబడతాయి. వెబ్‌కి అప్‌లోడ్‌ చేసినప్పుడల్లా అవి తరచుగా ఎడోబ్‌ ప్లాష్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్లేబ్యాక్‌ చేయబడతాయి.ఈ వాస్తవికత మీరు అనుకున్నదానికంటే దగ్గరగా ఉంటుంది. అయితే నిజమైన 3D చిత్రాలు ఖర్చుతో కూడుకున్నవి మరియు నిర్మించటం కష్టం కాని సాంకేతికత మెరుగుపడుతోంది అందరికి అందుబాటులోకిరానుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ A1  అనేది సైన్స్‌ఫిక్షన్‌ చిత్రాల నుండి మనకు బాగా తెలిసిన విషయం. ఆటోఫోకస్‌ మరియు ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సిస్టమ్‌లు రెండూ ట్రాకింగ్‌ మరియు ఆటోమేటిక్‌ ఎక్స్‌పోజర్‌ ఫీచర్‌వలె ఖచ్చితమైన ఫలితాలు పొందేందుకు A1  ఉపయోగిస్తాయి. ఐఫోన్‌ ఈ కొత్త పోర్బయిట్‌ మోడ్‌ A1   పవర్డ్‌ ఫిల్టర్‌లను కలిగిఉంది. ఇవి ఎడిటింగ్‌ ఈజీగా చేస్తాయి. మీ కంప్యూటర్‌లోని ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కూడా కాలక్రమేణా A1 తో అభివృద్ధిచెంది మీకంప్యూటర్‌లోని నిర్దిష్ఠ ఫోల్డర్‌లను గుర్తించి లేబుల్‌ చేస్తుంది, మీ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు అనుగుణంగా ఉంటుంది. కాని ఫొటోగ్రాఫర్‌లు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే రోబోట్‌లు ఈపనిని చేపట్టవు.

ప్రస్తుతం ప్రపంచమంతా దీనిపై దృష్టిసారించింది. అన్నిరంగాల్లోనూ A1 ఇమిడిపోవాలనే ఉద్దేశ్యంతో ఇంజనీరింగ్‌ కోర్సుని పరిచయం చేసింది. దీంతో భారతదేశంలో అత్యధిక డిమాండ్‌ కల్గి ఉన్న కోర్సులలో ఒకటిగా చెప్పవచ్చు. రాబోయేరోజుల్లో యువతరం ఆలోచనలకు అనుగుణంగా రాబోయే అర్దశతాబ్దం సాంకేతిక అభివృద్ధిని దగ్గరలో మనమంతా చూస్తామని ఆశిద్దాం.

ఫొటోగ్రఫి యొక్క భవిష్యత్తు అనేది అభివృద్ధి చెందుతున్న నూతనవిధానాలుతో పాటు సాంకేతికతల ద్వారా ప్రభావితమయ్యే అవకాశాలపై ఆధారపడి ఉంది. ఆగ్మెంటెడ్‌ రియాలిటి (AR)  అభివృద్దిని సాంకేతికపై మళ్ళించింది. దీనిద్వారా ఉత్పత్తి ఫొటోగ్రఫి మరింత లీనమై ఇంటరాక్టివ్‌ అనుభవాలను అందించేందుకు AR మూలకాలను ఎక్కువగా వినియోగిస్తుంది.  ప్రధానంగా వినియోగదారు లను  మరింతగా వాస్తవికంగా, ఆకర్షణీయమైన రీతిలో ఉత్పత్తులను వీక్షించేందుకు పరస్పరచర్చ చేసేందుకు అనుకరిస్తుంది. అగ్మెంటెడ్‌ రియాలిటి అనేది డిజిటల్‌ విజువల్‌ ఎలిమెంట్స్‌, సౌండ్‌లు మరియు హోలోగ్రాఫిక్‌ టెక్నాలజీ ద్వారా సున్నితమైన ఆకర్షణీయంగా మన ఇంద్రియాల ద్వారా సాధింపబడే వాస్తవ ప్రపంచ పర్యావరణం యొక్క మెరుగైన, ఇంటరాక్టివ్‌ వర్షన్‌గా ఒక్కమాటలో చెప్పవచ్చు.

 ఇంతకుముందు చెప్పినట్లుగా 360 డిగ్రీ ఇమేజింగ్‌ టెక్నాలజి, మరియు కొన్ని అంశాలను ఆటోమేటిక్‌గా చేసే కృత్రిమ మేధస్సుగా పిలవబడే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టు రాజ్యం ఏలబోతున్నాయి. డ్రోన్‌ ఫొటోగ్రఫి ఇప్పటికే బాగా వాడుకలో ఉన్నప్పటికి మరింత సాంకేతికతను జోడిరచుకుని రాబోతున్నాయి. దీంతో సృజనాత్మక, డైనమిక్‌ షాట్‌లు కాప్చర్‌ చేసేందుకు వైమానిక ఫొటోగ్రఫి ఎక్కువ వినియోగంలోకి రానుంది.

ఫొటోగ్రఫి యొక్క భవిష్యత్‌ అభివృద్ధిచెందుతున్న సాంకేతికతలు మరియు ట్రెండ్‌ల శ్రేణి ద్వారా రూపొందించబడే అవకాశం ఉంది. దీనితోపాటు ఫొటోగ్రాఫర్‌లు పైపరిణామాలను దృష్టిలో ఉంచుకుని కష్టమర్ల యొక్క అవసరాలు వారి కోరికలకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తేనే ఈరంగంలో కొనసాగే ఛాయాచిత్రకారుల భవిష్యత్‌ మరింత ఉన్నతస్థాయికి చేరగలదు.

టి. శ్రీనివాస్ రెడ్డి. FRPS, [email protected]

Related Posts

ఫొటొషాప్ లో కుత్రిమ మేదస్సు గురించి విపులంగా: గణేష్ నాగ్పూర్
ఫొటొషాప్ లో కుత్రిమ మేదస్సు గురించి విపులంగా: గణేష్ నాగ్పూర్

<p><span style="color:#2980b9"><strong>హలో పాఠకులు</strong></span></p> <p>...

22, Dec 2023 1683
ఫొటొగ్రఫి లో లైటింగ్ యొక్క కళాత్మక నైపుణ్యం: సచిన్
ఫొటొగ్రఫి లో లైటింగ్ యొక్క కళాత్మక నైపుణ్యం: సచిన్

<p><strong>లైటింగ్ ఫోటోగ్రఫీకి పునాది, డెప్త్, యాక్షన్, (డ్రామా లను మిలితం చే...

22, Dec 2023 1641
@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
00notifications
close

Notifications

close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...