Tips

ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రాఫర్ల పరిస్తితి కత్తిమీద సాములా తయారు అయ్యింది

03, Dec 2023 2412 Views
ప్రస్తుత వెడ్డింగ్ ఫొటొగ్రాఫర్ల పరిస్తితి కత్తిమీద సాములా తయారు అయ్యింది

పెళ్లి అనగానే ముందుగా కస్టమర్లకు గుర్తొచ్చేది ఫొటోగ్రాఫర్. అతడు లేకుండా ఇంచుమించు ఏ పెళ్ళి జరగదు, పెళ్లికూతురు, పెళ్లి కుమారుడు కట్బకానుకలనయినా వదులుకుంటారేమొ గాని, ఫొటోగ్రాఫర్ లేకుండా ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోరు. ఫొటోగ్రాఫర్ల విలువ అంత విశిష్టమయినది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అనలాగ్ సిస్టమ్ (negative film, chemical processing) ఉన్న రోజుల్లో అన్ని పెళ్ళి కార్యక్రమాలను పరిమితమయిన ఫొటోల ద్వారా చక్కగా తీసి, ఆల్బమ్లో అంటించి డెలివరీ చేసేవారు. దాంతో ఫొటోగ్రాఫర్ల పని ముగిసేది.

కొత్త టెక్నాలజీ, డిజిట్ ఫొటోగ్రఫీ.
పేస్బుక్, యు ట్యూబ్ వచ్చాక ప్రజలందరూ ప్రపంచం నలుమూలల జరుగుతున్న పరిణామాలు గమనించి ఆ విధంగా తమ పెళ్ళి కవరేజ్ కూడా ఆ స్టాండర్ట్తో ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. ఒచ్చిన చిక్కల్లా దానికీ తగిన పారితోషికం ఇవ్వకపోవడమే. అయినా వారి కోరికలు మాత్రము మనము తీర్చాల్సివుంటుంది. అయితే మనము వీటన్నింటినీ అధిగమించి ఒక మంచి సక్సెస్ఫుల్ ఫొటోగ్రాఫర్లా రాణించాలంటే ఈ క్రింది విషయాలు గమనించడండి.

1.Pre-Wedding shoot. ఈ పద్ధతి మనము పాశ్చాత్య దేశాల్లో నుండి, దిగుమతి చేసుకోబడింది. ఫొటోగ్రాఫర్ యొక్క అసలు (ప్రతిభ ఇక్కడి నుండే మొదలవుతుంది. తక్కువ బడ్జెట్లో, కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త సెట్టింగ్లు, డే లైట్సు, ఎక్కువ మంది అసిస్టెంట్లు వీటన్నింటినీ మించి పక్క వాడి నుండి పోటి. తక్కువ బడ్జెట్లో కొత్తధనం చూపాలనే తాపత్రయం.

2. రెండవ అతిముఖ్యమైన విషయం, పోటీ తత్వం. అది దాటితె, మార్కెటింగ్, మనవి మనము సేల్ చేసుకోవడంలో సక్సెస్ అవడం.

3. మనము ఎన్ని పెళ్లిళ్లు చేసామని కాదు, ప్రతి పెళ్లి మనము తీసె మొదటి పెళ్లిలా భావించి అదే ఉత్సాహంగా కవర్ చేయడం. ఎందుకంటే కస్టమర్లకు అది మొదటి పెళ్లి కావచ్చును.

4. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లను ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. మీ ఏటిట్యూడ్, బిహేవియర్, డ్రెస్ సెన్, మాటతీరు చక్కగా ఉండాలి.

5. లేటెస్టు ఎక్సిప్మెంట్పై మంచి అవగాహన ఉండాలి.

6. ఫొటోగ్రాఫర్ ముఖ్యంగా ఫెయిల్ అయ్యేది ఎండ్ (ప్రోడక్ట్స్ (Photos & Videos) సరయిన సమయంలో డెలివరీ చేయకపోవడం. కస్టమర్లకు ముందు ఉన్న ఉత్సాహం తర్వాత తగ్గుతుంది. ఇది అందరు గమనించాలి. గొప్ప ఫొటోగ్రాఫర్గా రాణించాలంటె, వారి ఎండ్ ప్రొసెసింగ్ వారే నిర్వర్తించుకోవడం.

7. ఎల్లప్పుడూ ఫొటోగ్రాఫర్ ఒక పాజిటివ్ ఏటిట్యూడ్తో ఉండటం.

8. ప్రతి ఫొటోగ్రాఫర్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, తన దగ్గర పనిచేసే ప్రతి అసిస్టెంట్ కొన్నాళ్ళు మాత్రమే తనవద్ద పనిచేస్తాడని. ఇది న్యాచురల్ ప్రాసెస్. బాధపడకుండా ఉన్నన్ని రోజులు వారిని మంచిగా చూసుకోవడం, కొత్త వారికి టైనింగ్ ఇవ్వడం. దీనివల్ల మార్కెట్లో మీకు మంచి గుడ్విల్ ఉంటుంది. అత్యవసర సమయంలో మీ దగ్గర ఇదివరకు పనిచేసిన వారు సంతోషంగా సహాయం చేస్తారు. గుర్తుంచుకోండి.

9. ఇకపోతే అత్యంత ముఖ్యమయిన విషయం. పెళ్లి అనేది రెండు కుటుంబాల ఆనందంగా జరిగే ప్రక్రియ. దానిని అంతే అందంగా డాక్యుమెంట్ చేయడంలో ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభను చూపాలి. ఎల్లప్పుడూ అలర్ట్గా ఉ, మండపంలో జరిగే ప్రతి సంఘటనను నిశితంగా గమనించాలి.

పెళ్ళి కార్యక్రమములకు అతీతంగా సన్నిహితుల మధ్య జరిగే సంఘటనలను వారికి తెలియకుండా రికార్డు చేయడం. దీనినే కాండిడ్ ఫొటోగ్రఫి అంటారు.

10. వేరే సైడ్ నుంచి వచ్చిన ఫొటోగ్రాఫర్లను ఆప్యాయంగా పలకరించి, (ప్రేమతో కలసి పనిచేసుకోవడం.

11. చివరగా మీ (ప్రొఫెషన్ను గౌరవించడం. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయినందుకు గర్వించడం.

కె. విశ్వేందరరెడ్డి
తెలంగాణ ఫొటోగ్రఫి అకాడమి కార్యదర్శి

 

Related Posts

రివర్స్ రింగ్ తో మైక్రో ఫొటొగ్రఫి చేయవచ్చు ఏలాగో తెలుసుకుందాం
రివర్స్ రింగ్ తో మైక్రో ఫొటొగ్రఫి చేయవచ్చు ఏలాగో తెలుసుకుందాం

<p><strong>ప్రస్తుత పోటీ ప్రపంచంలో, ప్రత్యేకంగా ఫొటోగ్రఫి రంగంలో (క్రొత్తగా చ...

22, Dec 2023 2633
పరివార్ పోర్టల్ ద్వారా ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ బుకింగ్
పరివార్ పోర్టల్ ద్వారా ఫ్రీ లాన్సర్స్/ సర్వీస్ బుకింగ్

<p>మీరు ట్రాస్ఫర్ ఆర్డర్స్/ టేకింగ్ కి లేదా ఎల్.ఈ.డి వాల్, డ్రొన్, సెల్ఫీ బూత...

25, Apr 2024 1620
@php $ads = Ads(9 Join us at Parivar and connect with a community of photographers to help grow your business
 
    • Pre wed photo shoot locations in Telangana

      Pre wed photo shoot locations in Telangana and ap
    • Best Wedding photographer near by me

      photographer, videographer, candid photographer in Hyderabad
    • Photo stores in Hyderabad

      camera, accessories, lenses, tripod, bags in Hyderabad
    • jobs in photography

      designers, video editors
    • photography exhibition in India

      exhibition, expo, workshops, seminar, and canon
    • photography coupons near me

      coupons, album print Digi press near by me
    • led wall rentals near by me

      ledwall, tvs, online mixixng, selfy booth
    • photography news

      photo news, industry news, camera reviews, product list
00notifications
close

Notifications

close

What service do you need? Fototech Parivar India will help you

"Join Our All India Photo Parivar: Access Services and Expand Your Business"

Discover endless opportunities for business growth and service excellence as you become a part of our thriving All India Photo Parivar network

Add my business arrow_forward

Copyright ©2023-2030 Fototech parivar India Pvt Ltd. Proudly powered by Fototech Parivar India

Loading...